చంద్రముఖిని లేపారు…ఇప్పుడు బాధపడుతున్నారు
ఏపి మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు పై సెటైర్ల మీద సెటైర్లు విసిరారు. తాను ఎన్నికల సమయంలో చంద్రబాబుకి అవకాశం ఇస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే అని చెప్తే ఎవరైనా విన్నారా…అతను అబద్దాలు,మోసాలు చేస్తాడు అని చెప్పాను విన్నారా…చంద్రబాబు దృష్టిలో అభివృద్ది అంటే అది ఆయన కుటుంబ అభివృద్దే అని భావిస్తాడు తప్ప రాష్ట్రం గురించి ఆలోచించడు అని చెప్తే విన్నారా ….అంటూ ఏపి ప్రజలకు జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.చంద్రబాబు చెప్పే వన్నీ అబద్దాలు…చేసేవన్నీ మోసాలు అని తాను ఆనాడు చెప్పానని నేడు రాష్ట్రంలో అదే జరుగుతుందని చెప్పారు.చంద్రముఖిని లేపారు…ఇప్పుడు బాధపడుతున్నారు అని గుర్తు చేశారు. సూపర్ సిక్స్‌ని అటకెక్కించారని అదేమని ప్రశ్నిస్తే కేసులు,దాడులు,జైళ్లు అంటూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ రిపోర్టుల ఆధారంగానే అన్నీ పరిశీలించాలి తప్ప ఒక రాష్ట్ర అభివృద్ది,అప్పుల గురించి ఎలా అంటే అలా మాట్లాడటానికి వీల్లేదన్నారు. రాష్ట్రం విచ్ఛిన్నమైనట్లు చెప్పడం ధర్మమేనా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందంటే అది వైసీపి హాయాంలోనే అని స్పష్టం చేశారు.2014-19 వరకు జీడీపీ -4.47 గా తిరోగమించగా, 2019-24 వరకు 4.80 గా నమోదయ్యిందంటే ఎవరి హయాంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. పారిశ్రామిక రంగంలో 2019 నాటికి 11వ స్థానంలో ఉంటే.. తమ హయాంలో 9వ స్థానానికి ఎదిగామని జగన్ గుర్తు చేశారు.