“వారు పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ ఉందా.. అని చూస్తారు”..గోయెంకా
సంపన్న ఓటర్లపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంకా సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సంపన్నులు ఓటేయరని పేర్కొన్నారు. అక్కడ మలబార్ హిల్‌లో ఉండే సంపన్నులు పోలింగ్ కేంద్రానికి మెర్సిడెస్ బెంజ్‌లో వెళ్లాలా ?..బీఎండబ్లూలో వెళ్లాలా? అని ఆలోచిస్తూ, అక్కడ వాలెట్ పార్కింగ్ ఉందా? అని తనిఖీలు చేసుకుంటారని ఎద్దేవా చేశారు. క్యూలో సాధారణ ప్రజలతో కలిసి నిలబడి ఓటు వేయడానికి సంపన్నులు భయపడతారని వ్యాఖ్యానించారు. అంతవరకూ ప్రజాస్వామ్యం ఎదురుచూడాల్సిందేనన్నారు. ముంబయిలోని సినీ ప్రముఖులు, సంపన్న వర్గాల వారిని ఉద్దేశించి ఆయన ఈ పోస్టు పెట్టడంతో అవి వైరల్‌గా మారడంతో పాటు, అందరినీ ఆలోచనలో పడేశాయి. ముంబయి, పూణె, నాగ్‌పూర్ వంటి నగరాలలో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర సగటు కంటే తక్కువ శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం.