24 గంటల్లో అటాక్ చేస్తరు..
తమ దేశంపై రానున్న 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక చర్యకు సిద్ధం అవుతుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ ఆరోపించారు. దాడులకు సంబంధించి ఇండియా ప్రణాళికలు చేస్తున్నట్లు తమ వద్ద కచ్చితమైన నిఘా సమాచారం ఉందన్నారు. భారత్ ఎలాంటి దాడులకు పాల్పడినప్పటికీ వాటిని ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. తమది కూడా ఉగ్రవాద బాదిత దేశమేనన్న తరార్… పహల్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణకు సహకరిస్తామని ఇప్పటికే ప్రకటిచినట్లు తెలిపారు. నిన్నటి సమావేశంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ భారత ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత పాక్ సమాచార మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

