ఫీజు కట్టలేదని కొట్టడమే కాక ఎండలో నిలబెట్టారు
ఫీజు కట్టలేదనే కారణంతో విద్యర్థులను కొట్టడమే కాకుండా ఎండలో నిలబెట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఉన్నవ్ జిల్లా బంగార్మావులో బాల విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో కొందరు విద్యార్థులు ఫీజులు కట్టలేదని టీచర్లు వారిని కొట్టారు. అంతే కాకుండా వారిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకుండా రోజంతా వారిని ఎండలోనే నిలబెట్టారు. దీంతో పిల్లలు ఏడూస్తూ రోడ్డుపై నిలబడ్డారు . దీనిని గమనించిన కొందరు వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా అసలు ఇటువంటి విషయానికి పిల్లలని శిక్షిస్తారా? వారికి అసలు బుద్ధి వుందా లేదా అంటూ కామెంట్లు పెట్టారు. ఎదైనా ఉంటే పిల్లల తల్లిదండ్రలను పిలిచి ఫీజు గురించి ప్రశ్నించాలి కానీ ఇలా వారిని ఇబ్బంది పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పిల్లలను సక్రమమైనా మార్గంలో పెట్టే ఉపాధ్యాయులే ఇలా చేస్తే ఏలా అని మరికొందరు మండిపడుతున్నారు.