Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

తొక్కిస‌లాట‌లో చ‌నిపోయింది వీళ్లే

తిరుమ‌ల తొక్కిస‌లాట‌లో చ‌నిపోయిన వారి వివరాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి(37) ,ఇదే జిల్లాకు చెందిన కంచ‌ర‌పాలెం వాస్త‌వ్యురాలు శాంతి(35), ర‌జిని(47),ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట‌కు చెందిన బాబు నాయుడు(51),త‌మిళ‌నాడు రాష్ట్రం సేలం జిల్లా మేచారి గ్రామానికి చెందిన మ‌ల్లిగ‌(50),ఇదే రాష్ట్రానికి చెందిన పొల్లాచ్చి వాస్తవ్యురాలు నిర్మల‌(45) లు ఈ తొక్కిస‌లాట‌లో మృతి చెందిన‌ట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబాల‌కు రూ.కోటి చొప్పున ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని టిటిడి మాజీ ఛైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.