బట్టలు ఉతకాలని పిలిచి లైంగిక దాడి చేశారు
చిన్న పిల్లకు చాక్లెట్లు ఆశ చూపి…పెద్దోళ్ళైతే డబ్బు ఆశ చూపి లైంగిక దాడులు చేస్తున్న మృగాళ్ల సంఖ్య ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఇలాంటి ఘటనే తాజాగా హైద్రాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. మధురానగర్‌లో నివాసం ఉండే ఓ వివాహితకు అదే ఏరియాలో ఉండే ముగ్గురు యువకులు బట్టలు ఉతికితే రూ.500లు ఇస్తామని నమ్మబలికారు. వీళ్లంతా ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన వారు. డైలీ వేజ్ చేసినా అంత డబ్బు రాదని సంబరపడిపోయిన మహిళ ఆ ముగ్గురు ఇచ్చిన బట్టలు ఉతకడానికి వెళ్లింది. చుట్టు పక్కల ఎవరూ లేరని గ్రహించి తలుపులు వేసి సదరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు.గ్యాంగ్ రేప్ చేసి పడేసి వెళ్లడంతో స్థానికులు వచ్చి గమనించి స్పృహ కోల్పోయిన మహిళను తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అనంతరం వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.