వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని…
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మానవ సంబంధాలు మంటగలిపేలా వ్యవహరిస్తున్నారు కొందరు దారి తప్పిన యువతీయువతులు. వివాహేతర సంబంధాల కొనసాగింపు కోసం చివరకు కన్న వాళ్లను సైతం కడతేర్చడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. హైదరాబాద్ లోని నార్త్ లాలాగూడకు చెందిన లక్ష్మీ అనే మహిళ…అరవింద్ అనే వ్యక్తితో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.ఈ విషయం తల్లి సుశీల,అక్క జ్క్షానేశ్వరికి తెలిసిపోవడంతో వారు లక్ష్మీని గట్టిగా మందలించారు.అయినా లక్ష్మీ ప్రవర్తనలో మార్పు రాలేదు.ఇద్దరూ కలిసి లక్ష్మీ భర్తకు చెప్తామని చెప్పడంతో …ప్రియుడు అరవింద్‌తో కలిసి తల్లి,అక్క ఇద్దరినీ హత్య చేసింది.మృతదేహాలను గుర్తుపట్టకుండా ఉండేందుకు మూటగట్టి మున్సిపల్ డ్రైన్‌లో పడవేశారు. దుర్వాసన ను బట్టి మృతదేహాల మూటను వెలికి తీయించి దర్యాప్తు చేపట్టడంతో నిందితులు పట్టుబడ్డారు.కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.