మహారాష్ట్రలో వీటిపై నిషేధం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ముంబయి పోలీసులు ముందు జాగ్రత్తగా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఎగరవేయడంతో నిషేధం విధించారు. ఉగ్రముప్పు ఉండే అవకాశాలున్నాయని అందువల్లే ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 29 వరకూ 30 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు కొన్ని అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అందుకే ఎగిరే వస్తువులను నిషేధించారు. 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలు వెల్లడి చేస్తారు.

