‘వారు కూడా స్థానికులే’..హైకోర్టు
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు ఊరట కల్పించింది. 12 వ తరగతి వరకూ ఇతర రాష్ట్రాలలో చదివిన తెలంగాణ విద్యార్థులను కూడా స్థానికులుగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. దీనితో వీరు స్థానికత ఆధారంగా సీటు పొందవచ్చు. ఈ మేరకు జీవో 140ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.


 
							 
							