HealthHome Page SliderInternational

“రాబోయే మహమ్మారులకు కారణం ఇవే కావచ్చు”- హెచ్చరించిన WHO

రాబోయే కాలంలో మహమ్మారులుగా మారబోయే వ్యాధికారక క్రిములు, బాక్టీరియా, వైరస్‌ల జాబితాను విడుదల చేసింది WHO. ప్రజలలో వేగంగా వ్యాపించే వ్యాధికారక క్రిములు, తీవ్రమైన వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్లు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేని దాదాపు 30 వ్యాధుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కొత్త జాబితాలో మంకీపాక్స్, డెంగ్యూ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా, నిఫా వైరస్ వంటివి ఉన్నాయి. 2017 నుండి ప్రాధాన్యత కలిగిన వ్యాధికారకాలను గుర్తించినట్లు ఈనివేదికలో తెలిపారు. అధిక ప్రభావం కలిగిన వ్యాధికారక క్రిములు, మహమ్మారి వ్యాధుల నుండి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలలో అవగాహన పెంపొందించుకోవాలని హెచ్చరిస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆయా వ్యాధులను అరికట్టగలిగే వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలంటూ పేర్కొంది. ఇంకా ఈ జాబితాలో జికా వైరస్, పశువులలో వ్యాప్తికి కారణమైన హెచ్ 5, ప్లేగు, విబ్రియో కలరా 0139 జికాన్స్, ఆల్ఫా వైరస్, చికున్ గున్యూ, ప్రోటోటైప్ పాథోజెన్, డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఆయా ప్రభుత్వాలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసింది.