న్యూఇయర్ వేడుకలపై రూల్స్ ఇవే..
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. 31 వతేదీ ముందు వరకూ రకరకాల ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు వంటివి ఎలాంటి ఈవెంట్లు నిర్వహించాలన్నా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రతీ ఈవెంట్‌కి ఎంట్రీ, ఎగ్జిట్ వంటి ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి ఈవెంట్‌లోనూ అశ్లీలతకు తావు లేకుండా చూడాలని, సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకు ఆపేయాలన్నారు. ఎట్టి పరిస్థితులలో డ్రగ్స్‌కు అనుమతి లేదన్నారు. నియమిత సమయం వరకూ మాత్రమే మద్యం ఉపయోగించాలని, మద్యం సేవించిన వారు డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా ఉంటాయని పేర్కొన్నారు.