‘టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’..జనసేన బహిరంగ ప్రకటన
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య అసంతృప్తి బహిర్గతమయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారిమధ్య విభేదాలు బయటపడుతున్నాయి. రాజోలులో జనసేన కేడర్‌ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. రాజశేఖర్‌కి జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దని, జనసేన కార్యకర్తలను రోడ్డున పడేస్తున్న వారి నాయకులను కూడా రోడ్డున పడేద్దాం అంటూ పోస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించండంటూ పిలువునిచ్చారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ టికెట్ ఆశించిన రాజశేఖర్, కూటమి పొత్తులో భాగంగా అది జనసేనకు వెళ్లిపోవడంతో అలుక వహించారు. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు ఆయనకు సర్థి చెప్పినట్లు సమాచారం. దీనితో ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అయితే జనసేన సపోర్టు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.