దేశంలో ప్రజాస్వామ్యమే లేదు: కేసీఆర్
మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం లేనే లేదని మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ఆరోపించారు. `ఇక్కడా ఏక్‌నాథ్ షిండేను తెస్తాడంట. అహంకారమా. బలుపా.. ఏంటి ఇది.. ఇది దేశమా.. అరాచకమా.. సీఎంలపై, మంత్రులపై ఈడీ, బోడీ కేసులు పెడతారట. నేను రా అంటున్నా. వాళ్లు వస్తే వాళ్లే నాకు చాయి తాపించి పోతారు. పేద ప్రజలు నీకు భయపడరు. నీవు గోకినా.. గోకకున్నా.. మోదీ.. నేను నిన్ను గోకుతా. ఇది రాచరిక వ్యవస్థ కాదు. నీ గుండాగిరీ నడవదు. తమిళనాడు, బెంగాల్‌లో మూడొంతుల మెజారిటీతో గెలిచిన వారినే పడగొడతా అని బీజేపీ అంటోంది. మోడీ.. నిన్ను పడగొట్టలేమా. నీ అహంకారం, గర్వమే నీ శత్రువు. నిన్ను పడగొట్టేవాడే లేడా` అని ప్రధాని మోదీపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.

