అక్కడ జంక్‌ఫుడ్‌కి ట్యాక్స్
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జంక్‌ఫుడ్ వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో కొన్ని దేశాల ప్రభుత్వాలు అదనపు ట్యాక్స్‌ను విధిస్తున్నాయి. డెన్మార్క్, మెక్సికో, బ్రిటన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, కొలంబియా వంటి దేశాలలో ఈ ఫ్యాట్ ట్యాక్స్ అమలులో ఉంది. అనారోగ్యపు కొవ్వు 2.3 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆ పదార్థాలపై అదనపు ట్యాక్స్ విధిస్తూ మొట్టమొదటిగా 2011లో డెన్మార్క్ ఈ ట్యాక్స్‌ను మొదలుపెట్టింది. అనంతరం ఇతర దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి. కొన్ని దేశాలలో ఈ విధానం సత్పలితాలను ఇచ్చిందని, సుమారు 70 శాతం మంది పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్ నుండి ఆరోగ్యకరమైన పండ్లు, ఆహారాల వైపు మళ్లినట్లు ఒక సర్వేలో తెలిసింది. భారత దేశంలో కూడా కేరళలో, గుజరాత్‌లో మొదట్లో ఈ ప్రతిపాదనలు చేసినా, అనంతరం జీఎస్టీ రాకతో ఈ ట్యాక్స్ అమలు కాలేదు. అయితే కొన్ని దేశాలలో ఈ విధానంపై పలు వ్యాపార సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోర్టులకెక్కాయి. అయితే ప్రపంచ జనాభాలో అధిక శాతం స్థూలకాయులు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని కోరుతున్నారు.