అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి, బీభత్సం సృష్టిస్తోంది. నాలుగురోజులుగా ఏపీ దక్షిణకోస్తాలో,రాయలసీమలో, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు. పెద్ద ఎత్తున కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాయుగుండం తీరం దాటి, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడును ముంచెత్తుతోంది. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే చెన్నై నగరంలో పలువురు ధనవంతులు సకల సౌకర్యాలు గల హోటల్ రూమ్స్ బుక్ చేసుకుని, ముంపు బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని సమాచారమిచ్చింది వాతావరణ శాఖ.