టాయ్‌లెట్లకు తలుపులు లేవు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థినుల ధర్నా
వై.రామవరం: టాయ్‌లెట్లకు తలుపులు లేవు.. కరెంటు లేకపోతే నీళ్లు రావు. దాని గురించి ప్రిన్సిపల్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదు. లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాగైతే ఎలా చదువుకోగలం అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం పి.ఎర్రగొండ గురుకుల స్కూల్ విద్యార్థినులు వర్షంలో ఆందోళనకు దిగారు. సోమవారం స్కూల్ ఎదుటధర్నా చేశారు. వసతి గృహంలో 12 టాయ్‌లెట్లు ఉండగా.. రెండింటికి మాత్రమే తలుపులున్నాయి. మిగతా వాటికి లేకపోవడంతో 5 నెలల నుండి తీవ్ర అసౌకర్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.