Home Page SlidermoviesNationalNews Alert

ఆ స్టార్ హీరోలకి వారి మాస్టర్ రిక్వెస్ట్..

దక్షిణాది సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, తమిళ హీరో విజయ్‌లు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందినవారని తెలిసిందే. వారిద్దరికీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిన గురువు ఒకరే కావడం విశేషం. తాజాగా వారి మాస్టర్ వారిద్దరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. చెన్నైలోని మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిహాని హుస్సేని(60) వద్ద వీరిద్దరూ కెరీర్ తొలి రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు. ఈ స్టార్స్‌కు విద్య నేర్పించిన ఆయన ప్రస్తుతం చాలా ఇబ్బందులలో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో, అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ఖరీదైన ఈ చికిత్సకు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తీవ్ర అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవాలయంలా తాను చూసుకునే శిక్షణా కేంద్రాన్ని అమ్ముతున్నానని పేర్కొన్నారు. క్యాన్సర్‌పై పెద్ద పోరాటం చేస్తున్నానని, ప్రతీరోజూ రెండు యూనిట్ల రక్తం అవసరం అవుతోందని పేర్కొన్నారు. ఆయన రిక్వెస్ట్ ఏంటంటే తన శిష్యులు విజయ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ శిక్షణా కేంద్రాన్ని కొనాలని కోరారు. తన వద్ద శిక్షణ తీసుకునే సమయంలో పవన్ అనే పేరు తనే పెట్టానని చెప్పారు. పవన్ తనకు రోజూ టీ చేసి, ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని పవన్ తనతో చెప్తూ ఉండేవారని చెప్పారు. తన శిక్షణా కేంద్రాన్ని వాణిజ్య లేదా, అపార్ట్‌మెంట్‌గా మార్చడం తనకు ఇష్టం లేదన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రంలోని పవన్ పాత్రని తమిళ్‌లో ‘బద్రి’ పేరుతో విజయ్ పోషించారు. విజయ్‌కు గురువు పాత్రలో మాస్టర్ హుస్సేని నటించారు. విజయ్ కూడా ఒలింపిక్ విజేతలను తమిళనాడులో తయారు చేయాలనుకునేవాడని, అందుకే విజయ్ కానీ, పవన్ కానీ తన కోరిక తీర్చాలని అభ్యర్థించారు.