Home Page SliderNational

డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి.. తర్వాత ఏమైందంటే..?

తన సోదరి వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తోన్న ఓ యువతి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. ఓ యువతి సోదరి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ముందుకు కుప్ప కూలిపోయింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.