BusinessHome Page SliderInternationalLifestyleNews Alertviral

అట్టహాసంగా ప్రపంచకుబేరుడి పెళ్లి..

ప్రపంచంలోనే ఎలాన్ మస్క్ తర్వాత రెండవ కుబేరునిగా పేరు పొందిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండవ వివాహం అట్టహాసంగా జరగబోతోంది. 2023లో తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఫ్రాన్స్‌లో ఒక లగ్జరీ నౌకలో దాదాపు రూ.21 కోట్ల విలువ చేసే గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసి, నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ 2018 నుండి డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 2019లో బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్‌కు విడాకులిచ్చారు. వీరిద్దరికీ 4గురు పిల్లలు. ప్రస్తుతం ఇటలీ తీరంలో బెజోస్‌కు ఉన్న 500 మిలియన్ డాలర్ల విలాస నౌకలో జూన్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇటలీలో వెనిస్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకలు ఏర్పాటు చేయనున్నారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన వివాహం చేసుకోబోయే 54 ఏళ్ల లారెన్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆమెకు కూడా గతంలో వివాహమై, ఇద్దరు పిల్లలున్నారు.