మెగాస్టార్ కి ముద్దు పెట్టిన మహిళ
మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఫొటో వైరల్ గా మారింది. అసలు విషయమేమిటంటే.. యూకే పార్లమెంట్ లో లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకోవడానికి చిరంజీవి లండన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్ట్ లో మెగాస్టార్ కు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో చిరంజీవిని చూసిన ఆనందంలో ఓ మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. అయితే.. ‘చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే.. మా అమ్మను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లా’ నని ఆ మహిళా అభిమాని కొడుకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.