Home Page SliderTelangana

మావగారితో కలిసి భర్తను హతమార్చిన భార్య

తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో మంజుల అనే మహిళ తన మావగారు నారాయణతో కలిసి భర్త రాములును గొడ్డలితో హతమార్చింది. శవాన్ని ఇంటిముందు పాతిపెట్టింది. అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు విషయం చెప్పగా నిందితులను అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో పోలీసులు విచారించారు. దీంతో అసలు నిజాలు వెల్లడయ్యాయి.