ఆడబిడ్డ పెండ్లికి ఊరంతా ఏకమై..
పేదింటి ఆడపడుచు పెండ్లికి ఊరంతా ఏకమై అండగా నిలిచారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అయితే ఆమె కుటుంబం ఖర్చులు భరించలేని పరిస్థితి ఉండటంతో గ్రామంలోని 40 కుటుంబాల ఆడపడుచులు అందరూ కలిసి తోచినంత పోగేసి రూ. 20వేలు ఆర్థిక సాయం చేశారు. ఇలా ఆడబిడ్డ పెండ్లి కోసం అంతా ఒక్కటై తమ ఐక్యతతోపాటు మానవత్వాన్ని చాటారు. అయితే ఆదివాసీ గ్రామాల్లో వివాహ సమయంలో ఎలాంటి కట్న కానుకల సాంప్రదాయం లేకపోవడం విశేషం.