crimeHome Page SliderInternationalPolitics

యుద్ధం ఆపాల్సిందే.. పుతిన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ … రష్యా అధ్యక్షుడు పుతిన్ ని హెచ్చరించారు. లేదంటే భారీ ఆంక్షలు విధిస్తామని త‌త్ఫ‌లితంగా తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు. రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు, టారిఫ్ లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ వార్ ప్రారంభమయ్యేదే కాదని ట్రంప్ అభిప్రాయ‌ప‌డ్డారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక నుంచి ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదని ఆశాభావం వ్య‌క్తం చేశారు.