బాంబు దాడి నుంచి తప్పించుకున్న W.H.O చీఫ్
యూరోప్ దేశాల యుద్దకాండ సెగ W.H.O చీఫ్ కే తగిలింది.ఇది దురదృష్టవశాత్తు జరిగినప్పటికీ ఆయన మాత్రం ఆ దేశం పై ఫైర్ అవుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గ్యాబ్రియాసిస్.. యెమెన్ దేశ పర్యటనలో ఉండగా ఇజ్రాయెల్ విసిరిన వైమానిక బాంబు దాడికి గురయ్యారు.అయనతో ఉన్న ఇద్దరు ఈ బాంబు దాడిలో చనిపోగా ఆయన ఒక్కరే మృత్యు మొహంలో తొంగి చూసి ప్రాణాలతో బయటపడ్డారు. యెమెన్‌లో పరిస్థితులను సమీక్షించి,అక్కడ జైళ్ళలో ఉన్న పలువురు ఖైదీలను విడుదల చేసే వ్యవహారంలో ఆరోగ్య సంస్థ అధికారులతో ఆయన భేటీ అయ్యారు.సమావేశ అనంతరం సనా విమానాశ్రయానికి చేరుకున్నారు.విమానం కోసం అక్కడ వేచి చూస్తుండగా ఇజ్రాయెల్ విసిరిన వైమానిక బాంబ్.. అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో పడింది.వాటి శకలాల ధాటికి విమానాశ్రయంలో ఉన్న వారు చాలా మంది తీవ్ర గాయాలుపాలవ్వగా,ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.ఆ ఇద్దరూ చీఫ్ పక్కనే ఉన్నారు.దాంతో బతుకు జీవుడా అంటూ విమానాశ్రయం వెలుపలికి వెళ్లిపోయారు.దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.