Home Page SliderNational

మనసుని ఆకట్టుకునేలా ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్

అలనాటి రామచంద్రుడు ట్రైలర్ విడుదలైంది. కృష్ణవంశీ కథానాయకుడిగా తెరకెక్కిన అలనాటి రామచంద్రుడు. మోక్ష కథానాయిక, ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిలుకూరి ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించారు. హైమావతి, శ్రీరామ్ జడపోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం అలనాటి రామచంద్రుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్‌ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హాజరై టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.