కమ్ముకున్న వాణిజ్య యుద్ధం..రూ.10 లక్షల కోట్లు ఆవిరి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల భయంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయం కమ్ముకుంది. ఏ దేశ ఉత్పత్తులనైనా అమెరికాలో విక్రయించడానికి కనీసం 10 శాతం నుండి 49 శాతం వరకూ పన్నులు విధిస్తున్నారు. దీనితో భారత్‌లోని స్టాక్ మార్కెట్ సూచీలు కూడా డీలా పడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.85.44 వద్దకు చేరింది. భారత్ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు రూ.10 లక్షల కోట్ల నష్టాన్ని చూశాయి.