News

“కల్కి”లో బుజ్జికి వాయిస్ ఇచ్చిన టాప్ హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కల్కి 2898AD”.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ సునామీ సృష్టింస్తోంది. దీంతో ఈ సినిమా ప్రస్తుతం రూ.1000కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ నడిపిన బుజ్జికి ఎవరు వాయిస్‌ ఇచ్చారనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కల్కి మూవీ టీమ్ బుజ్జికి వాయిస్ ఇచ్చింది ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్‌ అని వెల్లడించింది. ఈ మేరకు ఆమె వాయిస్ ఇచ్చిన వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దీంతో అభిమానులంతా బుజ్జికి వాయిస్ ఇచ్చింది కీర్తి సురేషే అని మేము ముందే గెస్ చేశామని కామెంట్స్ చేస్తున్నారు.