IPL లో సొంతగడ్డపై సత్తా చాటలేకపోతున్న జట్టులు
ఈ IPL సీజన్లో మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కానీ ఈ IPL జట్టుల మ్యాచ్‌లన్నీ “ఇంట గెలిచి..రచ్చ గెలవాలి” అన్న దానికి పూర్తిగా భిన్నంగా కొనసాగుతున్నాయి.ఎలా అంటే ఈ జట్టులు ముఖ్యంగా తమ సొంత గడ్డపై సత్తా చాటలేకపోతున్నాయి. ఈ IPLలో కొన్ని జట్టులు తమ సొంత గడ్డపై పరాజయం పాలవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన IPL మ్యాచుల్లో 4 జట్టులు వరుసగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనడం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా అహ్మదాబాద్‌లో GT,బెంగుళూరులో RCB,హైదరాబాద్‌లో SRH.. నిన్న జైపూర్‌లో RR జట్లు వరుసగా ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ జట్టులకు వారి హోమ్ టౌన్స్ కలిసి రావట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్‌లోనైనా ఇది రిపీట్ కాకుడదని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన RR Vs LSG మ్యాచ్‌లో కేవలం 10 పరుగుల తేడాతో RR పై LSG ఎవరు ఉహించని విధంగా పైచేయి సాధించింది.

