crimeHome Page SliderInternational

డ్రోన్ దాడి… తెలివిగా చిన్నారులను తప్పించిన టీచర్లు

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్‌ను ప్రయోగిస్తే, చాలా తెలివితో, చాకచక్యంగా పాఠశాల నుండి చిన్నారులను తప్పించారు టీచర్లు. టెల్ అవీవ్‌పై ఇటీవల క్షిపణులతో కూడా దాడిచేశారు హెజ్‌బొల్లా. తాజాగా డ్రోన్‌ను ప్రయోగించారు. ఇజ్రాయెల్‌లోని నెషార్‌లో కిండర్ గార్డెన్ స్కూల్ సమీపంలో డ్రోన్ పడింది. అయితే ఆ సమయంలో సైరన్లు సరిగ్గా వినిపించలేదని వారు చెప్పారు. కానీ దగ్గర్లో మరో పట్టణం నుండి సైరన్ వినిపించడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. చిన్నారులను బాంబు షెల్టర్‌కు తరలించారు. పాఠశాల వెలుపల చెట్టుపై డ్రోన్ కూలింది. అక్కడ అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.