సీఎం జగన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా వాలంటీర్లు ఏపీలోని మహిళల సమాచారాన్ని సేకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. కాగా ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ నేత బోండా ఉమ సమర్థించారు. ఏపీలో నిజంగానే ప్రజల గోప్యతకు రక్షణ లేదని బోండా ఉమ విమర్శించారు. ఏపీలో వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా ప్రజల డేటాను విదేశాలకు అమ్ముకోవాలనేది జగన్ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తున్నారని బోండా ఉమ పేర్కొన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వంలో ప్రజల అకౌంట్లలో డబ్బులకు కూడా గ్యారెంటీ లేదని బోండా ఉమా స్పష్టం చేశారు.

