చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపిన టీడీపీ కౌన్సిలర్
ఏపీలో అధికార పార్టీకి ప్రజల నుంచి ప్రజాప్రతి పక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతోంది. ఇప్పటివరకు గడప గడపకు కార్యక్రమంలో పలువురు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..తాను టీడీపీ కౌన్సిలర్‌గా గెలిచి 30 నెలలు అవుతుందన్నారు. అయినప్పటికీ తన వార్డులో తాగునీటి కొళాయి కూడా వేయించుకోలేక పోతున్నానంటూ టీడీపీ కౌన్సిలర్ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. అయితే దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో సమావేశంలో గందర గోళం నెలకొంది.