స్టీల్ ప్లాంట్ లో మోగిన సమ్మె సైరన్
పబ్లిక్ రంగ డొమైన్ లో …దేశంలోనే అతి పెద్దదైన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం లాంటి పరిణామాలతో కార్మికులు విసిగిపోయి ఉన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుననారు. ఈ నేపథ్యంలో నిరవధిక సమ్మెలో పాల్గొంటామని కాంట్రాక్ట్ కార్మికులు చెబుతున్నాయి.7నుంచి ఎట్టి పరిస్థితిల్లో విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు.కాగా ఇటీవలే మోదీ ప్రభుత్వం …వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి రూ.11,400కోట్ల ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే.

