Telangana

నర్సయ్య గౌడ్ రాకతో బీజేపీ బలం పెరిగింది

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. నర్సయ్యగౌడ్ రాకతో బీజేపీ బలం పెరిగిందని వ్యాఖ్యానించారు. దుబ్బాక, హూజురాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు కేసీఆర్‌ను కలిసే పరిస్థితి టీఆర్ఎస్‌లో లేదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ది చెబుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెల 19న బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని.. 20 నుంచి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. మునుగోడులో బీజేపీకి విజయాన్ని అందిచాలని బూర గౌడ్ భావిస్తున్నారని చెప్పారు.