స్టార్ ఆటగాడు మాట నిలబెట్టుకున్నాడు..
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన మాట నిలబెట్టుకున్నాడు. ముందుగా ప్రకటించినట్లుగా తన అభిమానికి 4 కోట్లు విలువ చేసే లంబోర్గిని ఉరుస్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు . ఐపీఎల్ 2025 యాడ్‌లో ప్రకటించినట్లు, విజేతతో ఫోటోలు దిగి సర్ ప్రైజ్ చేశాడు. అయితే.. ఐపీఎల్ 2025 ముగుస్తున్న నేపథ్యంలో ఆ పోటీలో గెలిచిన తన అభిమానికి కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఈ సందర్భంగా విన్నర్ ఫ్యామిలీతో ఫోటోలు కూడా దిగాడు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ కారును గెలుచుకుంది.. రోహిత్ శర్మ వీరాభిమాని కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

