NationalNews

షేవింగ్‌ గొడవ… కస్టమర్‌ గొంతు కోసిన యజమాని

షేవింగ్‌ విషయంపై తలెత్తిన గొడవ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని బోధిడి గ్రామంలో దారుణం జరిగింది.  బోధిడి గ్రామంలో అనిల్‌ మారుతి శిండే నిర్వహిస్తున్న సెలూన్‌ షాప్‌కు వెంకట్‌ సురేశ్‌ దేవ్‌ అనే యువకుడు షేవింగ్‌ చేయించుకునేందుకు వెళ్లాడు. సగం షేవింగ్ చేశాక వెంకట్‌ను డబ్బులు  ఇవ్వమని అనిల్‌ అడిగాడు. మొత్తం షేవింగ్‌ చేశాక ఇస్తానని వెంకట్‌ చెప్పినా… అనిల్‌ ఒప్పుకోలేదు. మాటా మాటా పెరిగి పదునైన కత్తితో వెంకట్ గొంతు కోయగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకట్‌ బంధువులు తీవ్ర ఆగ్రహంతో సెలూన్‌ షాప్‌పై దాడి చేశారు. దుకాణాన్ని తగల బెట్టారు. పారిపోయిన అనిల్‌ను వెతికి మరి పట్టుకుని విచక్షణారహితంగా దారుణంగా కొట్టి చంపారు. అనంతరం గ్రామంలోని అనిల్‌ ఇంటిని కూడా తగలబెట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు… హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని.. ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.