Home Page SliderNational

జమ్మూకాశ్మీర్‌లో జోరుగా కొనసాగుతున్న రెండవ విడత పోలింగ్

జమ్ముకాశ్మీర్‌లో రెండవ విడత పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం 7 గంటలకే మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. శ్రీనగర్, రాజౌరీ, పూంఛ్, బడ్‌గామ్,గండేర్‌బల్, రియాసీ జిల్లాలలో ఈపోలింగ్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా వంటి కీలక నేతలు నేటి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ విడత పోలింగులో 25 లక్షల పైచిలుకు ఓటర్లు పాల్గొంటున్నారు. ఈనెల 18న జరిగిన తొలిదశ పోలింగులో 61.38 శాతం ఓటింగ్ నమోదయ్యింది. చివరి విడతగా అక్టోబర్ 1న 40 స్థానాలకు ఓటింగు జరగనుంది.