ఏపీలో రెండో విడత రైతు భరోసా
వైఎస్ ఆర్ రైతు భరోసా రెండో విడత అక్టోబర్ 17న అందించనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. దీనికి సంబంధించి అన్నీ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకొమని రౌతులకు సూచించారు. మొత్తం మూడు విడతలుగా జమ చేసే ఈ పథకం ద్వారా రూ.13,500 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. తొలి విడత కింద రూ.7,500 ఇచ్చిన ప్రభుత్వం..రెండో విడత కింద అక్టోబర్ 17 మరో రూ.4000 జవ చేయనున్నట్టు తెలిపింది. అలాగే చివరి విడతగా రూ.2000 జమ చేయనుంది. మొత్తంగా రూ.13,500 పీఎం కిసాన్ , రైతు భరోసా డబ్బులుగా కలిపి రైతుల ఖాతాలలో జమ అవుతాయి.