Home Page SliderTelangana

అడవుల పరిరక్షకులు ఆదివాసీలే..

జూలాజికల్ పార్క్ అమరుల స్మారక చిహ్నం వద్ద కార్పోరేషన్ చైర్మన్ పోడెం వీరయ్య, అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి RM డోబ్రియల్ మరియు ఇతర సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మానవుల తొలి పరిణామక్రమం అడవుల నుంచి ప్రారంభమైందని అటువంటి అడవుల పరిరక్షణ మనందరి బాధ్యతని తెలిపారు…అడవుల పరిరక్షణ కోసం విధుల్లో మరణించిన అటవీ సిబ్బంది త్యాగాలు మరువకూడదాన్నారు..అడవుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ శాఖ సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలన్నారు…పచ్చదనం పరిరక్షణ కోసం, వన్యప్రాణుల సంరక్షణకు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న అటవీ సిబ్బందికి అభినందనలు తెలిపారు.. సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సందేశాలను చదివి వినిపించారు.

అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి RM డోబ్రియల్ మాట్లాడుతూ 1984 నుంచి ఇప్పటికీ వరకు విధుల్లో ప్రాణాలు కోల్పోయిన 22 మంది సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు..అడవులలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తమ సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వనమహోత్సవం కార్యక్రమం ద్వారా 20కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నమని తెలిపారు.