తన పదవికి రాజీనామా సమర్పించనున్న ప్రధాని
జపాన్‌లో వెలుగు చూస్తున్న రాజకీయ కుంభకోణాలు, జీవన వ్యయాలు పెరగడంతో ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తలొగ్గారు. రాబోయే రోజుల్లో తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెల పదవి నుండి దిగిపోనున్నట్లు ప్రకటించారు. ప్రజల విశ్వాసం లేకుండా రాజకీయాలు నడపలేమని, రాజకీయ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతోనే ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

