ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సిందే..
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ విషయంపై దేశ ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ జరిగిన హింసాత్మక సంఘటనల కారణంగా మహిళలు, చిన్నారులతో పాటు దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

