Home Page SliderNationalNews AlertPolitics

అసెంబ్లీలో నుండి గెంటేసిన వ్యక్తికి స్పీకర్ పదవి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకుల సంతోషానికి పట్టపగ్గాలేవు. బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారు. నేడు ముఖ్యమంత్రి అభ్యర్థి రేఖాగుప్తా మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తాజాగా ఢిల్లీ కొత్త స్పీకర్ విషయంలో ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. 2015లో అసెంబ్లీలో జరిగిన ఒక ఆందోళనలో బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను భుజాలపై ఎత్తుకుని ఢిల్లీ అసెంబ్లీ నుండి మార్షల్స్ బయటకు గెంటేశారు. ఇప్పుడు తాజాగా ఆయనను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా నియమించింది బీజేపీ అధిష్టానం.  2015లో అప్పటి ఆప్ ఎమ్మెల్యేలు ఆల్కాలంబా, ఓపీ శర్మలపై బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆందోళన చెలరేగింది. అప్పుడు జరిగిన గొడవలో విజేందర్ గుప్తాకు ఈ పరిస్థితి ఎదురయ్యింది.