ఈటలను అరెస్ట్ చేసిన పోలీసులు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలోనే ఈ రోజు ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన ఇటీవల స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ సస్పెన్షన్ విధించినట్టు అసెంబ్లీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈటల అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అయితే అసెంబ్లీ బయట ఈటలకు,పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు… ఈటల రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఎలా అరెస్ట్ చేస్తారని రాజేందర్ పోలీసులను ప్రశ్నించారు. బానిసలా వ్యవరించొద్దంటూ.. పోలీసులపై మండిపడ్డారు. ఈ విధంగా టీఆర్ఎస్ తనపై ఏడాది కాలంగా కుట్ర చేస్తుందని ఈటల ఆరోపించారు.


 
							 
							