Breaking NewscrimeHome Page SliderNational

మొరాయించిన విమానం… సెల‌బ్రిటీల ఆందోళ‌న‌

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు మ‌రో సారి ఆందోళనకు దిగారు. శంషాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య త‌లెత్త‌డంతో ఎయిర్ పోర్ట్ వ‌ద్ద గంద‌ర‌గోళం నెల‌కొంది. ఉదయం 9గంటలకి వెళ్లాల్సిన విమానం టెకాఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. విమానంలో సినీ సెలబ్రిటీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు.ఇదే విమానంలో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులున్నారు.వీరంతా కుంభ‌మేళాకు వెళ్లేందుకు బ‌య‌లుదేరారు. రూ. 30 వేలు పెట్టి టికెట్ కొన్నా ఇప్పటి వరకు విమానం టేకాఫ్ కాలేదంటూ కౌంట‌ర్ల వ‌ద్ద నిర‌శ‌న వ్య‌క్తం చేశారు.