తాటతీస్తా…తోలు తీస్తా…మోకాళ్లపై కూర్చోబెడతా
హెడ్డింగ్ చూశాక బహుశా ఈ మాటలు తరచుగా అనే వ్యక్తి ఎవరో మీరు ఈపాటికే ఊహించి ఉంటారు.అవును మీ గెస్సింగ్ కరెక్టే .ఆయన పవన్ కళ్యాణే.ఆడపిల్లకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను అని బాలయ్య బాబు సినిమాల్లో డైలాగులు చెబుతూ…ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చెయ్యాలి అంటూ బహిరంగ సభల్లో మృగస్వభావాన్ని చాటుకుంటూ ఉంటాడు. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య బాబు కోవలోకే వెళ్లిపోయాడు. మాది జగమంత కుటుంబం అని క్రమశిక్షణ కలిగిన కుటుంబం అని చెప్పే పవన్ కళ్యాణ్…అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో మెగా కుటుంబీకులంతా పరామర్శిస్తే కనీసం ఎక్స్‌లో పోస్ట్ కూడా చేయలేదు. కానీ రాయలసీమలో ఎంపిడివో పై దాడి చేశారన్న నెపంతో అక్కడకు వెళ్లి ఎంపిడివోని పరామర్శించారు.ఎందుకింత హడావుడిగా అక్కడకు వెళ్లాడని అంతా ఆరాతీస్తే …దాడి చేసిన వారు వైసీపి వారని ప్రచారం జరుగుతుంది.అక్కడ దాడి జరిగిందీ లేనిదీ వీడియోల రూపంలో ఆధారాలు లేవు.కానీ అల్లు వారి అబ్బాయిని అరెస్ట్ చేసింది వీడియో ఆధారితంగా ఉంది.కొంపలు మునిగిపోయినట్లుగా తాటతీస్తా…తోలు తీస్తా…మోకాళ్లపై కూర్చోబెడతా..వైసీపి నాయకులూ ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు.కానీ టిడిపి హయాంలో ఆనాటి ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ఎడమ కాలు తన్నినా నోరు మెదపలేదు ఈ నాటి డిప్యూటీ సీఎం. అట్లుంటది …పవన్ కళ్యాణ్ తోని!


 
							 
							