News AlertTelangana

నింగికి ఎగసిన నీరు

నీరు పారడం సర్వ సాధారణమైన విషయం. కానీ అదే నీరు ఆకాశానికి ఎగరడం అంటే వింతనే చెప్పాలి. ఇటువంటి సంఘటనే సింగురు ప్రాజెక్టులో చోటుచేసుకుంది. సింగురుకి చెందిన మంజీరా నదిలోని నీరు టోర్నాడోను తలపిస్తు ఆకాశంలోనికి ప్రయాణిస్తున్నట్టు కనిపించింది. ఈ దృశ్యం సుమరు మూడు నిమిషాల పాటు కనులవిందు చేసింది. దీనిని గమనించిన స్థానికులు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. భూమి పైకా నుండి నీరు ఆకాశంలోనికి ప్రయాణిస్తున్నట్టు , టోర్నాడో రూపంలో కనిపించిన ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.