హాథ్రస్ తొక్కిసలాటలో నిర్వాహకులదే తప్పు
హాథ్రస్ తొక్కిసలాటలో నిర్వాహకులదే తప్పుగా కనిపిస్తోందని ఈ ఘటనపై ఏర్పాటు చేసిన సిట్ చీఫ్ పేర్కొన్నారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై రాష్ట్రప్రభుత్వం సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇంతవరకూ 90 మందిని విచారించిన ఈ ముగ్గురు సభ్యుల బృందం కార్యక్రమ నిర్వాహకులదే తప్పని ప్రాధమిక దర్యాప్తులో తేల్చింది. హాథ్రస్ జిల్లాలోని సికంద్రరావ్ ప్రాంతంలో ఫుల్‌రయా,ముగల్ గఢీ అనే గ్రామాల మధ్యలోని ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 80 వేల మంది హాజరవుతారని పోలీసుల అనుమతి తీసుకున్నారు. కానీ రెండున్నర లక్షల మందికి పైగా వచ్చినట్లు తేలింది. దీనివల్ల జనాలు బాబా వెళ్లపోయే సమయంలో పాదదూళి కోసం జరిగిన తొక్కిసలాట, కిక్కిరిసి ఉన్న స్థితి వల్లే ఊపిరాడక మరణాలు సంభవించినట్లు పోర్టుమార్టం రిపోర్టులలో తేలింది. ఈ ఘటనపై ఇంకా బాబా పేరు చేర్చలేదని, కానీ అతనిని కూడా తప్పకుండా విచారిస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.

