జవాన్లకు సవాల్‌గా మారిన ఆపరేషన్
కర్రెగుట్టలపై 11వ రోజు కూడా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ జవాన్లకు, భద్రతా దళాలకు పెను సవాల్‌గా మారింది. ఇప్పటి వరకూ రెండు గుట్టలను స్వాధీనం చేసుకున్నాయి ఈబలగాలు. ఇంకా పదుల సంఖ్యలో కొండలు, సొరంగాలు ఉండడంతో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా హెలికాప్టర్లు, డ్రోన్లపైనే ఆధారపడ్డారు బలగాలు. కూంబింగ్‌కు ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవని వారు చెప్తున్నారు. మరోపక్క సేఫ్‌జోన్‌లోకి మావోయిస్టులు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి. మావోయిస్టులను ఈ ప్రాంతం నుండి శాశ్వతంగా పంపించివేయడానికి కర్రెగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటుకు బలగాల యత్నం చేస్తున్నాయి.