సినిమా ఆలస్యంగా ప్రదర్శించారని….
సినిమా ముందు అరగంట యాడ్స్ వేసి తన సమయాన్ని వృధా చేశారని పి.వి.ఆర్.ఐనాక్స్, బుక్ మై షోపై బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారు.2023లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల షోకు ఓ పి.వి.ఆర్.ఐనాక్స్ లో సినిమాకు వెళ్లగా, సినిమా ప్రదర్శనకు ముందు అరగంట యాడ్స్ వేసి సినిమాను సాయంత్రం 4:30 గంటలకు మొదలెట్టారని కోర్టులో పిల్ వేశాడు.దీంతో సాయంత్రం 6 గంటలకు అయిపోవాల్సిన సినిమా 6:30 అయిపోయిందని, ఈ ఆలస్యం వల్ల తన షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకున్నానని పి.వి.ఆర్.ఐనాక్స్ పై, బుక్ మై షోపై సదరు వ్యక్తి కేసు వేశాడు.సమయాన్ని వృధా చేసినందుకు పి.వి.ఆర్.ఐనాక్స్ ను…ఆ వ్యక్తికి రూ.65,000లు చెల్లించాలని, అలాగే రూ.1,00,000 జరిమానా కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది.అయితే సమయం వృధా కేసులో బుక్ మై షోకి సంబంధం లేదని తీర్పు నుంచి మినహాయించింది న్యాయస్థానం.