మంత్రికి రెండేళ్ల జైలుశిక్ష
మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ పార్టీ నేత మాణిక్ రావు కొకఠేకు, అతని సోదరునికి నాసిక్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధించింది. ఈ కేసు 30 ఏళ్ల క్రితం జరిగిన మోసానికి సంబంధించినది కావడం విశేషం. ప్రభుత్వ కోటాలో నకిలీ పత్రాల ద్వారా అక్రమాలకు పాల్పడి ఫ్లాట్‌లు పొందారని అప్పటి మంత్రి టీఎస్ డిఘాలే చేసిన ఫిర్యాదుతో వీరిపై కేసు నమోదయ్యింది. 1995 నాటి ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారించిన నాసిక్ జిల్లా కోర్టు నేడు వీరికి శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే మంత్రి మాట్లాడుతూ తనకు ఈ కేసులో బెయిల్ మంజూరయ్యిందని, తీర్పుపై అప్పీలుకు వెళ్తానని చెప్పారు.

