Home Page SliderInternationalNationalNews AlertPolitics

సౌదీలో ట్రంప్, పుతిన్‌ల భేటీ..ఉక్రెయిన్‌కి షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా రష్యా అధినేత పుతిన్‌తో త్వరలోనే సౌదీలో భేటీ కాబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పుతిన్ డిమాండ్ల ప్రకారమే ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు ట్రంప్. దీనితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రష్యా ఆక్రమిత భూభాగాల విడుదలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రష్యా ప్రధాన డిమాండయిన కీవ్‌కు  నాటో సభ్యత్వం ఇవ్వడం లేదన్న విషయాన్ని ఒప్పుకున్నారు ట్రంప్. అలాగే రష్యా ఆక్రమణలోని క్రిమియా వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశం లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, పుతిన్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకురాగలరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకువచ్చేందుకు ఏం చేయాలన్న విషయాన్ని ట్రంప్‌తో తాను మాట్లాడానని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మ్యూనిచ్ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఈ సదస్సు తర్వాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.